సికింద్రాబాద్ తాడ్‌బండ్ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిలై కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోయిన్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
కార్లపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
September 23, 2021
0