తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని దర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల చిన్నంబావి గ్రామానికి చెందిన చిన్నయ్య(45) ఇటీవల తనకున్న ఆస్తిని అమ్మి ఇంటిని నిర్మించి తన చెల్లెళ్లకు ఇచ్చాడు. ఈ విషయంలో చిన్నయ్య, భార్య రాములమ్మ మధ్య గొడవలు జరిగేవి. భర్త చేసిన పని నచ్చక రాములమ్మ చిన్నయ్యను హత్య చేసి తన ఇంట్లోనే మరుగుదొడ్డి కింద పాతిపెట్టింది. రెండు నెలలుగా చిన్నయ్య కనిపించకపోవడంతో అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి చిన్నయ్యను చంపింది రాములమ్మే అని విచారణలో తేల్చారు. రాములమ్మ చెప్పిన వివరాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మరుగుదొడ్డి ఉన్న ప్రాంతంలో జేసీబీ సాయంతో ఇంటిని కూల్చేసి.. మురుగుదొడ్డి కింద ఉన్న చిన్నయ్య మృతదేహాన్ని వెలికితీసి, రాములమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.