* మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు !
* మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడనిఅడిగినట్టు!
* మంగలిని చూసి గాడిద కుంటినట్లు !
* మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు !
* మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
* మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట !
* మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు !
* మంచి మనిషికొక మాట మంచి గొడ్డుకొక దెబ్బ !
* మందుకని పంపిస్తే మాసికం నాటికి వచ్చే రకం !
* మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు !
* మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు !
* మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు !
* ముంజేతి కంకణానికి అద్దమేల ?
* మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు !
* ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి !