వ్యవసాయం చేయటం మానేసి రోడ్లపై ఆందోళన చేసే వారిని రైతులు అని ఎలా అంటాం? ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నవారిని రైతులు అని పిలవకూడదు. కుట్రదారులతో చేతులు కలిపి ఆటలాడుతున్నారు. ఇటువంటి వారిని రైతులు అనకూడదు. నిజమైన రైతులు వారి పంటపొలాల్లో వ్యవసాయం చేస్తుంటారు. ఇటువంటి పనులు చేయరని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో ఆమె రైతులకు క్షమాపణ చెప్పారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారని, నేను కేవలం హూలిగాన్స్ అని మాత్రమే అన్నానని, అంతకుమించి ఏమీ అనలేదని సమర్ధించుకున్నారు. నా మాటలు వక్రీకరించబడ్డాయి. ఇది రైతులను గానీ మరి ఎవరినైనా గానీ బాధపెట్టి ఉంటే..క్షమాఫణ కోరుతున్నానని తెలిపారు. నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ వివరణ ఇచ్చారు మంత్రి మీనాక్షి లేఖి.
క్షమాపణ చెప్పిన కేంద్రమంత్రి
July 23, 2021
0