హైదరాబాద్, పాతబస్తీలో జూన్ 28, 29 మధ్య రాత్రి ముజ్రా పార్టీ హల్‌చల్‌గా జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వలీ ఫంక్షన్ హాల్‌లో ముజ్రా పార్టీ జరిగింది. పెళ్లి రిసెప్షన్‌లో నజీర్ అనే వ్యక్తి ముజ్రా పార్టీ ఏర్పాటు చేసాడు. అయితే ముజ్రా పార్టీకి సంబంధించిన వీడియోలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వీడియోలు బయటికి పంపినందుకు ఫోటోగ్రాఫర్ సాదిక్‌పై పెళ్లివారు దాడి చేశారు. దాడిపై చాంద్రాయణగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.