లీటరు పెట్రోల్ రూపాయే !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కుమారుడు మంత్రి ఆదిత్య థాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రూపాయికే లీటరు పెట్రోల్ అందించారు. డోంబీవలీ యువసేన ఆధ్వర్యంలో థానేలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఈ అవకాశం కల్పించారు. రూపాయికే పెట్రోల్ ఇస్తున్నారని తెలియగానే వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. బంక్ ముందు కి.మీ. మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్ నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంక్‌లో లీటరు పెట్రోలు 50 రూపాయలకే అందించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు వచ్చేవారికి ఈ సదుపాయం కల్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)