వాట్స్‌యాప్‌ జరా భద్రం

Telugu Lo Computer
0


\
వాట్స్‌యాప్‌... ఇది తెలియని స్మార్ట్ ఫోన్ యూసర్ లేదంటే అతిశయోక్తి లేదు. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్‌, వాయిస్‌ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే షేర్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ వీలుకల్పిస్తుంది. 

మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం ఇప్పుడొక అలవాటుగా మారింది. వాట్స్‌ యాప్‌ ద్వారా షేర్‌ చేసే సమాచారం అంత సురక్షితం కాదని, వాటిని మనం షేర్‌ చేస్తున్న వారే కాకుండా, ఇతరులు సైతం చూసేందుకు, యాక్సెస్‌ చేసేందుకు అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్స్‌ యాప్‌లో మనం షేర్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు, డేటాను ఇతరులు కూడా యాక్సెస్‌ చేసుకునే అవకాశముందని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. మెసేజ్‌లు ఎక్స్ఛేంజ్‌ చేసేటప్పుడు ఉపయోగించే ఎన్‌క్రిప్షన్‌ కోడ్స్‌, మన ఫోన్‌లోని ఎస్‌డి కార్డులో సేవ్‌ అవుతాయి. ఈ కోడ్స్‌ను ఇతర ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ద్వారా డీకోడ్‌ చేసే అవకాశముందట. ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హ్యాకింగ్‌ భూతం ఈ లోపాలను అవకాశంగా తీసుకొని ముఖ్యమైన డేటాను తస్కరించే అవకాశం వుందని, వాట్స్‌ యాప్‌ వినియోగదార్లు తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఈ వాట్స్‌యాప్‌ అప్లికేషన్‌ వినియోగదార్ల సంఖ్య 50కోట్లను అధిగమించింది. ఉక్రెయిన్‌కు చెందిన జాన్‌ కౌమ్‌, బ్రియాన్‌ యాక్టన్‌ అనే అమెరికన్‌ కలిసి 2009లో ఈ యాప్‌ సేవలను ఆరంభించారు. మొబైల్స్‌, ఎంత పాపులారిటీ వున్నా ఈ యాప్‌కు సైతం హ్యాకింగ్‌ గొడవ తప్పడంలేదు. వేలాది రూపాయలతో కొన్న స్మార్ట్‌ఫోన్లు, అందులోని సమాచారం సురక్షితంగా వుండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

జాగ్రత్తలు :
మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌ యాప్‌ సందేశాలను లాక్‌ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్‌ అకౌంట్‌ సెక్యూరిటీని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకు గూగుల్‌ప్లే స్టోర్‌లో 'వాట్స్‌యాప్‌ లాక్‌' పేరుతో ఓ ఉచిత యాప్‌ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా వాట్స్‌యాప్‌ మెసేజ్‌లను లాక్‌ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను రీఇన్‌స్టాల్‌ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు కనిపించకుండా పోతుంటాయి. 

ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్‌ వినియోగదార్లు వాట్స్‌యాప్‌ సెట్టింగ్స్‌లోని చాట్‌ సెట్టింగ్స్‌ను సెలక్ట్‌ చేసుకుని చాట్‌ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే పాత సంభాషణలను తిరిగి పొందొచ్చు. 

పబ్లిక్‌ వై-ఫైకు దూరంగా ఉండంతో పాటు గుర్తు తెలియని నంబర్లను బ్లాక్‌ చేయాలి. దీంతోపాటు మీ వై-ఫైకు పటిష్టమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)