ఐఫోన్‌ రూ.68 కే

Telugu Lo Computer
0
సరుకు వ్యాపారమూ ... చౌక ప్రచారమూ ....
.......................................................
కొందరికి సన్మానమూ ప్రచారమే, చెంపదెబ్బా ప్రచారమే !!
అవిసగింజంత ఖర్చుతో అవని మొత్తం పాకిపోయేంత ప్రచారం పొందటంలో
కార్పొరేట్లకు మించిన ఘనాపాటీలు మరొకరు ఉండరు .. !!

ఏడాదిన్నర క్రితం స్నాప్ డీల్ వెబ్ సైట్ ఒక ఆఫరు ప్రకటించింది !!
"రూ.68కే ఐఫోన్‌ 5ఎస్‌ .. " అనేది దాని సారాంశం !
ఆ ఒక్క ఆఫరుకే కొన్ని వేల మంది ఆ సైట్ ని సందర్శించారు ...
(అంతటి ప్రచారం, స్పందన టీవీ లేదా పత్రికలకు ప్రకటనలు ఇవ్వటం ద్వారా పొందాలీ అంటే _
కనీసం రూ . 50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ... )
ఆ ప్రకటన చూసి చాలామంది లాగానే _
పంజాబ్‌ కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నిఖిల్‌ బన్సల్‌ ఆర్డర్‌ చేశాడు.
అయితే _ ఎన్నాళ్లకూ మొబైల్‌ డెలివరీ కాకపోవడంతో కంపెనీకి పలుమార్లు మెయిల్‌ చేశాడు.
సంస్థ స్పందించకపోవడంతో తన దగ్గర ఉన్న ఆధారాలతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.
***
ఫోరం స్పందించింది ..
నిఖిల్‌కు కంపెనీ ప్రకటించిన ఐఫోన్‌ రూ.68 కే ఇవ్వడంతోపాటు
రూ.2000 నష్ట పరిహారం అందించాలని గత ఏడాది మార్చి 26న తీర్పునిచ్చింది.
స్నాప్ డీల్ బుద్ధిగా ఆ తీర్పును పాటిస్తే సరిపోయేది !
కానీ, ఆ డీల్‌ సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని, తాము అలా ప్రకటించలేదని అప్పీల్‌ చేసింది.
వాద ప్రతివాదాల తరవాత ఫోరం ఈసారి ఇంకొంచెం వడ్డించింది ..
ఇప్పటికీ ఐఫోన్‌ అందించడంలో విఫలమయ్యావు కాబట్టి _
సేవాలోపం కొనసాగింది కాబట్టి _ ఫోను ఇవ్వటంతో పాటు
రూ.10,000 అదనంగా చెల్లించాలని ఈనెల 12న తీర్పు చెప్పింది !!
***
ఇక్కడ ఫోరం మొట్టికాయలూ, ఓ రూ. 40 వేల ఖర్చూ అయితే అయింది కానీ _
అంతకు వెయ్యింతల ప్రచారం దక్కిందని లోలోన మురిసిపోతోంది అట స్నాప్ డీల్ !!
పరువు పోవటం కూడా ప్రచారమే అనుకోవటం వ్యాపార నీతి మరి !!
***
అవునట్టు _ నిన్నో మొన్నో రూ . 261 కే స్మార్ట్ ఫోన్ అని వార్తలొచ్చాయి ..
చూశారా మీరు?
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)